BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 05 December 2025, 08:56 am
Posted by : NTODAY NEWS OFFICIAL

గ్లోబల్ సమ్మిట్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆహ్వానం

తెలంగాణ
05 Dec, 2025 - 08:56 AM
290 వీక్షణలు

గ్లోబల్ సమ్మిట్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

NTODAY NEWS: ఆంధ్రప్రదేశ్ (అమరావతి) ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య భేటీ 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌-2025'కు హాజరుకావాలని ఆహ్వానం డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో సదస్సు నిర్వహణ దావోస్ సమ్మిట్ తరహాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'కు హాజరుకావాల్సిందిగా చంద్రబాబును ఆయన ఆహ్వానించారు. శుక్రవారం అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ వేదికగా ఈ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఈ సదస్సును ప్రపంచ ప్రఖ్యాత దావోస్ సదస్సు తరహాలో నిర్వహిస్తున్నామని చంద్రబాబుకు వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు హాజరవుతున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అధికారికంగా ఆహ్వానాన్ని అందించిన కోమటిరెడ్డి, సమ్మిట్ ప్రాధాన్యతను ముఖ్యమంత్రికి తెలియజేశారు. Follow us on Website Facebook Instagram YouTube