BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 18 May 2026, 05:49 pm
Posted by : కూనురు మధు

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / వనేపాకల
18 May, 2026 - 05:49 PM
705 వీక్షణలు

NTODAY NEWS చిట్యాల :- వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీరక, పంట దిగుబడి సరిగ్గా రాకపోవడంతో మనస్తాపానికి గురై ఒక రైతు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చిట్యాల ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం వనిపాకల గ్రామానికి చెందిన శిరసనగండ్ల వెంకన్న (57) అనే రైతు వ్యవసాయ అవసరాల నిమిత్తం తన ఇంటిపై ఫైవ్ స్టార్ ఫైనాన్స’లో సుమారు 5 లక్షల రూపాయల వరకు  అలాగే తనకు తెలిసిన వారి వద్ద మరో 3 లక్షల రూపాయల వరకు అప్పులు చేశాడు. అయితే, ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక వెంకన్న తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు అని తెలిపారు. ​ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన ఆయన, ఆదివారం  రాత్రి  కుటుంబ సభ్యులందరూ పడుకున్న తర్వాత తన ఇంట్లోని రేకుల గదిలో ఉన్న ఇనుప రాడుకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ​మృతునికి భార్య సైదమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని భార్య సిరిసినగండ్ల సైదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చిట్యాల సబ్ ఇన్స్పెక్టర్  మామిడి రవికుమార్ తెలిపారు...