BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 09 June 2026, 08:12 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలి : ఎంపీ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
09 Jun, 2026 - 08:12 PM
156 వీక్షణలు

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి, జూన్ 9: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా, జిల్లా అభివృద్ధికి సంబంధిత శాఖల అధికారులు మరియు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామేలు, అనురాగ్ జయంతి, భాస్కర్ రావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ శాఖల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, అమలులో ఉన్న పథకాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు అందించారు.

ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఆయా శాఖలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు అమలు చేస్తోందని, వాటిని అధికారులు పూర్తిస్థాయిలో పారదర్శకంగా అమలు చేయాలని అన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే వివిధ శాఖలకు మంజూరైన అభివృద్ధి నిధులు సద్వినియోగం అయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో శ్రీవాణి, మంజుల, అవేజ్ చిస్తీ, రేఖ బాబురావు, వివిధ శాఖల జిల్లా అధికారులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.