BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 March 2026, 10:08 am
Posted by : కూనురు మధు

అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న బిజెపి శ్రేణుల అరెస్ట్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
23 Mar, 2026 - 10:08 AM
193 వీక్షణలు

అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న బిజెపి శ్రేణుల అరెస్ట్ 

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైందని నిరసిస్తూ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు చేపట్టిన 'అసెంబ్లీ ముట్టడి' కార్యక్రమం చిట్యాలలో ఉద్రిక్తంగా మారింది. సోమవారం ఉదయం హైదరాబాద్‌ తరలివెళ్తున్న బిజెపి నాయకులను చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ నేతృత్వంలో పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ​ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రైతులు, మహిళలు, యువత, మరియు ఉద్యోగులను నిలువునా వంచించిందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 వాగ్దానాలు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పటివరకు ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, బిజెపి ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉండి పోరాడుతుందని స్పష్టం చేశారు. అరెస్ట్ అయిన వారిలో బిజెపి చిట్యాల మండలాధ్యక్షుడు బిజెపి ప్రధాన కార్యదర్శి చుంచు శ్రీను, జిల్లా కౌన్సిల్ సభ్యులు కూరెల్ల శ్రీను, పాల రవి వర్మ, బెల్లి నరేష్, మురళీకృష్ణ, నూకేష్ తదితరులు ఉన్నారు.