BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 23 March 2026, 10:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అతిథుల నిలయం… పందుల తాండవం!

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 10:58 PM
139 వీక్షణలు

అతిథుల నిలయం… పందుల తాండవం!  అనంతపురం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో కలకలం

అనంతపురం జిల్లాలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో షాకింగ్ పరిస్థితులు బయటపడ్డాయి. నిత్యం అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు రాకపోకలతో రద్దీగా ఉండే ఈ అతిథి గృహం ఇప్పుడు పందుల ఆవాసంగా మారింది. అతిథి గృహ ప్రాంగణంలో డజన్ల కొద్దీ పందులు స్వైర విహారం చేస్తుండటం స్థానికులను, సందర్శకులను కలవరపెడుతోంది. గెస్ట్ హౌస్‌లోకి సైతం ప్రవేశించి, పాడుబడ్డ గదుల్లోనే స్థిరపడిపోయిన పందులు అక్కడే తిరుగుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. కొంతమంది సిబ్బంది, సందర్శకులపై దాడి చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.ఇంత కీలకమైన ప్రభుత్వ అతిథి గృహంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం అధికార యంత్రాంగ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 “మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చే స్థలంలో ఇదే పరిస్థితి ఉంటే… సాధారణ ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంటుందో?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అధికారులు తక్షణమే స్పందించి శుభ్రత చర్యలు చేపట్టి, పందుల సంచారాన్ని అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.