BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 08 June 2026, 12:19 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా!

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
08 Jun, 2026 - 12:19 PM
91 వీక్షణలు

ఒడిశాలో ఓ ప్రభుత్వ ఇంజినీర్ అక్రమాస్తుల కేసులో విజిలెన్స్ అధికారులకు చిక్కాడు. నెలకు కేవలం ₹6 వేల జీతంతో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ITDA అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) బైకుంఠనాథ్ బెహెరా ప్రస్తుతం కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

అక్రమాస్తులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో బ్యాంకు లాకర్లలో సుమారు ₹2 కోట్ల విలువైన ₹500 నోట్ల కట్టలు లభించినట్లు సమాచారం.

అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో 5 భవనాలు, 13 ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బంగారం, నగదు, ఇతర పెట్టుబడులు మరియు ఆస్తుల విలువపై ఇంకా లెక్కింపు కొనసాగుతోంది.

అధికారిక ఆదాయానికి మించి భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమికంగా తేలడంతో కేసు దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది.