BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 24 January 2026, 07:55 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

భద్రత మాసోత్సవాల్లో అవగాహన కార్యక్రమం

తెలంగాణ
24 Jan, 2026 - 07:55 PM
343 వీక్షణలు
జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో అవగాహన కార్యక్రమం ఆర్టీవో కార్యాలయంలో “శిక్షణతో భద్రత – సాంకేతికత ద్వారా” అంశంపై కార్యక్రమం NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ పట్టణంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా శనివారం ఆర్టీవో కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ ఆధ్వర్యంలో “శిక్షణతో భద్రత – సాంకేతికత ద్వారా” అనే అంశంపై ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంవీఐ సుప్రియ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయం కేటాయించి తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఆంధ్రప్రదేశ్‌ను క్లీన్ అండ్ గ్రీన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత తీసుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు ప్రమాదాల్లో సంభవిస్తున్న మరణాల్లో సుమారు 70 శాతం హెల్మెట్ ధరించకపోవడం వల్లనే జరుగుతున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను భారంగా భావించకూడదని, అది తమ కుటుంబానికి ఇచ్చే భరోసా అని అన్నారు. వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వ్యక్తి కూడా హెల్మెట్ ధరిస్తే సంపూర్ణ రక్షణ లభిస్తుందని చెప్పారు.మద్యం సేవించి వాహనం నడపడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, అతివేగాన్ని నియంత్రించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో కార్యాలయ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు. #RoadSafety #NationalRoadSafetyMonth #HelmetSafety #TrafficAwareness #SafeDriving #NoHelmetNoRide #MotorVehicleDepartment #Punganur #AndhraPradesh #RoadAccidentPrevention Follow us on Website Facebook Instagram YouTube