BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 20 March 2026, 09:07 pm
Posted by : కూనురు మధు

బడ్జెట్‌లో ఎంజీయూకి మొండిచేయి

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
20 Mar, 2026 - 09:07 PM
164 వీక్షణలు

బడ్జెట్‌లో ఎంజీయూకి మొండిచేయి  

బడ్జెట్ ప్రతులను దహనం చేసిన ఏబీవీపీ

​నల్గొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మహాత్మా గాంధీ యూనివర్సిటీని  పూర్తిగా విస్మరించడంపై అఖిల భారత విద్యార్థి పరిషత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఎంజీయూ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు బడ్జెట్ ప్రతులను దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ​అంకెల గారడీ తప్ప ప్రయోజనం లేదు
​ఈ నిరసన కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు కొంపల్లి సూర్య, నాగేష్ పాల్గొని ప్రసంగించారు. గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, గత రెండు బడ్జెట్‌ల మాదిరిగానే ఈసారి కూడా కేవలం "అంకెల గారడీ"తో ప్రజలను మభ్యపెట్టిందని వారు విమర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ ​ మొత్తం బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం 8 శాతం నిధులు మాత్రమే కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని మండిపడ్డారు. విశ్వవిద్యాలయాల పట్ల వివక్ష: ఉస్మానియా, చాకలి ఐలమ్మ యూనివర్సిటీలకు మినహా, ఎంజీయూతో సహా రాష్ట్రంలోని మిగిలిన యూనివర్సిటీలకు నిధుల కేటాయింపు శూన్యమని వారు ఆరోపించారు యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న పోస్టుల రిక్రూట్‌మెంట్‌పై గానీ, నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ పైన గానీ బడ్జెట్‌లో ఎటువంటి ప్రస్తావన లేకపోవడం దారుణమన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని వారు పేర్కొన్నారు. విద్యారంగాన్ని వినాశనం చేసే దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, విద్యార్థి లోకం తగిన బుద్ధి చెబుతుందని వారు హెచ్చరించారు. రాబోయే రోజుల్లో విద్యార్థుల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.