BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 08 April 2026, 03:34 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

బీసీ ధర్మ దీక్షకు మద్దతుగా పుంగనూరు లో రిలే నిరాహార దీక్ష..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
08 Apr, 2026 - 03:34 PM
115 వీక్షణలు

బీసీ ధర్మ దీక్షకు మద్దతుగా పుంగనూరు లో రిలే నిరాహార దీక్ష..

ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, బోడె రామచంద్ర యాదవ్ గారు చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షకు ప్రజల్లో విస్తృత మద్దతు సమీకరించడమే ఈ రిలే నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి మద్దతును కూడగట్టేందుకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు.

బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్  ఈ నెల 11వ తేదీన చేపట్టనున్న బీసీ ధర్మ దీక్ష ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా,  పుంగనూరు మూడేప్ప సర్కిల్ లో బిసివై పార్టీ నాయకులు, కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 

ఈ సందర్బంగా బిసి వై పార్టీ నాయకులు మాట్లాడుతు ఉమ్మడి కూటమి ప్రభుత్వం బీసీవై పార్టీ ఐదు ప్రధాన డిమాండ్లని నెరవేర్చాలని 

బీసీ రక్షణ చట్టం అమలు,రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయింపు,బీసీ కులాల కార్పోరేషన్లకు తగిన నిధుల కేటాయింపు,సమగ్ర కుల గణన నిర్వహణ,విద్య, మరియు ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పంచాలని మార్చి 31లోగ అమలు కానీ పక్షం లో  ఏప్రల్ 11న బీసీ వై పార్టీ అధినేత చేపట్టనున్న ఆమర నిరాహార దీక్ష లో పెద్ద ఎత్తున బిసి లు పాల్గొంటారని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ రాష్ట్ర PAC కమిటీ సభ్యులు పాల రమేష్ యాదవ్, పుంగనూరు నియోజకవర్గ కన్వీనర్ హరి బాబు యాదవ్, అన్నమయ్య జిల్లా యూత్ కో-కన్వీనర్ ఉత్తన్న, స్టేట్ ఎగ్జిక్యూటివ్ Member సాంబ మూర్తి తదితరులతో పాటు BCYPARTY Social Media గిరిబాబు కుమ్మర, వెంకటేష్ యాదవ్, స్వాతి ప్రసాద్, శంకర, గంగరాజు, చలపతి, నాగరాజు, గణేష్, జ్ఞానేంద్ర, గౌడ తదితరులు పాల్గొన్నారు.

బీసీల హక్కుల సాధన కోసం జరుగుతున్న ఈ ఉద్యమానికి అందరూ ఐక్యంగా మద్దతు తెలుపుతూ “బీసీ ధర్మ దీక్ష” విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ముడెప్ప సర్కిల్, మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆర్‌సీవై అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.