BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఆదేశాలతో హైకోర్టులో పిటిషన్..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
29 May, 2026 - 04:21 PM
92 వీక్షణలు

బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఆదేశాలతో హైకోర్టులో పిటిషన్.. జీవీఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియపై స్టే; బీసీ రిజర్వేషన్లు, కుల గణనపై త్వరలోనే తదుపరి చట్టపరమైన పోరాటం

అమరావతి / విజయవాడ: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) పరిధిలో వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చింది.

భారత చైతన్య యువజన పార్టీ (BCY Party) వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ స్పష్టమైన ఆదేశాల మేరకు.. పార్టీ సీనియర్ నాయకులు నరసింహ ప్రతాప్ భాగవతుల, పులివర్తి గీత హైకోర్టును ఆశ్రయించి ఈ రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు వెకేషన్ బెంచ్ (కోర్టు హాల్ నంబర్ 32), రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన G.O.Ms.No. 65 (తేదీ: 24-03-2026) మరియు మే 17 నాటి ప్రాథమిక నోటిఫికేషన్ అమలుపై తక్షణ తాత్కాలిక స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దేశవ్యాప్తంగా 'సెన్సస్ 2027' (జనగణన) ప్రక్రియ ప్రారంభమైనందున, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 31-12-2025 నాటికే అన్ని స్థానిక పరిపాలనా, వార్డు సరిహద్దులను 'ఫ్రీజ్' (యథాతథ స్థితి) చేస్తూ స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నాయని బీసీవై పార్టీ నేతలు కోర్టుకు వివరించారు. ఈ నిరోధిత కాలంలో కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా, అత్యంత వేగంగా వార్డుల సరిహద్దులను మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం పూర్తిగా చట్టవిరుద్ధమని వారు వాదించారు. మార్చి 18తో జీవీఎంసీ పాలకమండలి గడువు ముగిసిపోవడంతో, ప్రజల అభ్యంతరాలను అధికారికంగా పరిశీలించే ప్రజాప్రతినిధుల సభ కూడా లేకుండా ఏకపక్షంగా వ్యవహరించడాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

బీసీవై పార్టీ అధినేత మార్గదర్శకత్వంలో జరిగిన ఈ వాదనలతో ఏకీభవించిన గౌరవ న్యాయమూర్తి, వార్డుల సరిహద్దులను మార్చే తుది నోటిఫికేషన్‌తో సహా ఈ ప్రక్రియకు సంబంధించిన అన్ని తదుపరి చర్యలను తక్షణమే నిలిపివేయాలని (స్టాల్) ఆదేశించారు.

ఈ చట్టపరమైన విజయంపై బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ స్పందిస్తూ.. అధికార ప్రభుత్వ ప్రజావ్యతిరేక, ఏకపక్ష వైఖరిపై ఇది తమ మొదటి గెలుపు మాత్రమేనని స్పష్టం చేశారు. స్థానిక సంస్థలలో వెనుకబడిన వర్గాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడేందుకు—బీసీ రిజర్వేషన్ల వర్తింపు మరియు సమగ్ర కుల గణన (Caste Census) అంశాలపై ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా త్వరలోనే మరిన్ని భారీ చట్టపరమైన న్యాయపోరాటాలను సిద్ధం చేశామని, ఇవి ఇప్పటికే పైప్‌లైన్‌లో ఉన్నాయని, త్వరలోనే వీటిపై ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని బోడె రామచంద్ర యాదవ్ వెల్లడించారు.