BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 09 June 2026, 04:35 pm
Posted by : V శ్రీనివాస్

​బెల్లంపల్లిలో విద్యాసంస్థల నిర్మాణ పనుల తనిఖీ: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

తెలంగాణ
/ మంచిర్యాల / బెల్లంపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
09 Jun, 2026 - 04:35 PM
293 వీక్షణలు

పట్టణ ప్రాథమిక పాఠశాల, కస్తూరిబా విద్యాలయం పనుల పరిశీలన

సమగ్ర వసతి గృహ పాఠశాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచన 

ప్రజా ​ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్థల నిర్మాణాభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు చెప్పారు. మంగళవారం ఆయన బెల్లంపల్లి పట్టణంలోని రాంనగర్ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న పట్టణ ప్రాథమిక పాఠశాల నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పనులను త్వరగా పూర్తి చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అక్కడి అధికారులకు తెలిపారు. అనంతరం బెల్లంపల్లి మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి, అక్కడ నిర్మాణంలో ఉన్న భోజనశాల పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే నియోజకవర్గానికి ఒకటి చొప్పున మంజూరైన సమగ్ర వసతి గృహ పాఠశాల లో భాగంగా బెల్లంపల్లిలో చేపట్టిన పాఠశాల నిర్మాణ పనులను ఆయన నిశితంగా పరిశీలించారు.

​ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అనేక నూతన కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో సకల సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అల్పాహారం, మధ్యాహ్న భోజనం పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాలల నిర్మాణ పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు