BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 23 August 2026, 06:20 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బెంగళూరు జైలు గోడల వెనుక అధికారిణి లీలలు.. రౌడీ షీటర్‌తో వీడియో కాల్ కలకలం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:20 AM
111 వీక్షణలు

బెంగళూరు జైలు గోడల వెనుక అధికారిణి లీలలు.. రౌడీ షీటర్‌తో వీడియో కాల్ కలకలం

బెంగళూరులో జైలు వ్యవస్థలో సంచలనం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా పోలీస్ అధికారిణి రౌడీ షీటర్‌తో వీడియో కాల్‌లో అసభ్యకరంగా ప్రవర్తించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర చర్చకు దారితీసింది.

పోలీసుల విచారణలో ఈ ఘటనకు సంబంధించిన పలు కీలక విషయాలు బయటపడ్డాయి. కర్ణాటక స్టేట్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (కేఎస్‌ఐఎస్‌ఎఫ్‌)లో ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తున్న మహిళా అధికారి ఈ ఘటనలో ఉన్నట్లు గుర్తించారు.

ఆమె బెళగావిలోని హిండల్గా సెంట్రల్ జైలులో విధులు నిర్వహిస్తున్న సమయంలో, అక్కడ ఖైదీగా ఉన్న కుణిగల్ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ సాయికుమార్‌తో వీడియో కాల్ మాట్లాడినట్లు విచారణలో తేలింది. ఈ దృశ్యాలు 2024లో రికార్డు అయినట్లు పోలీసులు గుర్తించారు.

ఇటీవల సాయికుమార్ ఆ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మహిళా ఇన్స్పెక్టర్ అతనిపై కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అయితే ఈ వ్యవహారంలో మరో కోణం కూడా బయటపడింది. జైలు లోపల మొబైల్ ఫోన్, మద్యం, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు తన నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తూ సాయికుమార్ కూడా ప్రతిగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అతడు ఇచ్చిన మొబైల్ ఫోన్‌లోనే వీడియో రికార్డు అయినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మహిళా ఇన్స్పెక్టర్ సెలవులో ఉన్నట్లు సమాచారం. లంచం ఆరోపణలపై పోలీసు శాఖ అంతర్గత విచారణ ప్రారంభించింది. ఇదే సమయంలో జైలు అధికారుల అవినీతికి సంబంధించిన మరో వీడియో కూడా బయటకు రావడంతో బెళగావి సీఈఎన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఖైదీలతో సంబంధాలు, జైలు భద్రతా నిబంధనల ఉల్లంఘన, అవినీతి ఆరోపణలు ఒకేసారి తెరపైకి రావడంతో కర్ణాటక పోలీస్ శాఖలో ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.