BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 21 June 2026, 06:06 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తాం: ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎ. మస్తానయ్య

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 06:06 PM
140 వీక్షణలు

నూజివీడు పట్టణంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎ. మస్తానయ్య మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ మద్యం నిషేధ చట్టం–1995 (సవరణ చట్టం–2020) ప్రకారం రోడ్లు, పార్కులు, ఆటస్థలాలు తదితర బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం శిక్షార్హమైన నేరమని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ర్యాలీలో పాల్గొన్న అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల మహిళల భద్రతకు భంగం కలగడం, శాంతిభద్రతల సమస్యలు తలెత్తడం, కుటుంబాల్లో కలహాలు పెరగడం, యువత చెడు ప్రభావాలకు గురికావడం, పరిసరాల పరిశుభ్రత దెబ్బతినడం వంటి దుష్పరిణామాలను వివరించారు.

ప్రభుత్వం అనుమతించిన పర్మిట్ రూములు, బార్లలో మాత్రమే మద్యం సేవించాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మద్యం దుర్వినియోగం వల్ల కలిగే సామాజిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన నష్టాలను గుర్తించి మద్యపాన నియంత్రణలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల కార్యక్రమంలో భాగంగా నూజివీడు స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నట్లు ఎ. మస్తానయ్య తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రజలు చట్టాన్ని గౌరవించి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా సహకరించాలని అధికారులు కోరారు.