BREAKING
thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు
Date of Publish : 19 August 2026, 08:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బిర్యానీ ధర రూ.10 తగ్గింపు విషయంలో ఘర్షణ.. రెస్టారెంట్‌పై దాడి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 08:04 PM
89 వీక్షణలు

బిర్యానీ ధర రూ.10 తగ్గింపు విషయంలో ఘర్షణ.. రెస్టారెంట్‌పై దాడి

  • నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లిలో ఘటన.. ముగ్గురికి తీవ్ర గాయాలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి గ్రామంలో బిర్యానీ ధర విషయంలో జరిగిన చిన్న వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఎస్ఎస్ రెస్టారెంట్‌పై పోతవరప్పాడు గ్రామానికి చెందిన కొందరు యువకులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది.

బాధితుల వివరాల ప్రకారం.. పోతవరప్పాడు గ్రామానికి చెందిన సుమారు 15 నుంచి 30 మంది యువకులు మద్యం మత్తులో రెస్టారెంట్‌కు వచ్చి బిర్యానీ కొనుగోలు చేశారు. బిల్లు విషయంలో రూ.10 తగ్గించాలని కోరడంతో హోటల్ యజమాని, కొనుగోలుదారుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిన యువకులు కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి రెస్టారెంట్‌లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి దాడికి పాల్పడ్డారని బాధితులు తెలిపారు.

ఈ దాడిలో రెస్టారెంట్ యజమాని తుల్లిమిల్లి శ్రీనివాసరావు, ఆయన కుమారుడు తుల్లిమిల్లి రాజేష్‌తో పాటు ఒడిశాకు చెందిన హోటల్ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ముగ్గురిని నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కర్రలు, రాళ్లు, బీరు సీసాలతో దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు. తమపై మూకుమ్మడిగా దాడి చేసి హోటల్ సామగ్రిని ధ్వంసం చేశారని వారు వాపోయారు.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దాడికి పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.