BREAKING
వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

బయ్యారం వైకుంఠధామం నిర్మాణంపై సమగ్ర విచారణకు డిమాండ్

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Aug, 2026 - 01:21 PM
17 వీక్షణలు

బయ్యారం వైకుంఠధామం నిర్మాణంపై సమగ్ర విచారణకు డిమాండ్

మధిర నియోజకవర్గం, బయ్యారం గ్రామంలో నిర్మించిన వైకుంఠధామంపై గ్రామస్థుల అనుమానాలు

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర మండలం బయ్యారం గ్రామంలో ప్రభుత్వ, కేంద్ర నిధులతో నిర్మించిన వైకుంఠధామం నిర్మాణం, నిధుల వినియోగంపై సమగ్ర విచారణ జరపాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

వైకుంఠధామం నిర్మాణానికి మంజూరైన నిధులు, వాటి ఖర్చు వివరాలు, పనుల నిర్వహణ బాధ్యతలు, కాంట్రాక్టర్‌కు చేసిన చెల్లింపులు వంటి అంశాలపై అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కోరుతున్నారు. నిర్మాణం పూర్తయిన కొద్దికాలానికే భవనం దెబ్బతినడం, వినియోగానికి నోచుకోకపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిధుల వినియోగంపై స్పష్టత ఇవ్వాలి

వైకుంఠధామం నిర్మాణానికి ఎంత మొత్తం నిధులు మంజూరయ్యాయి? ఎంత ఖర్చు చేశారు? పనులు నాణ్యతతో జరిగాయా? నిధులు నిర్దేశిత పనులకే వినియోగించారా? అనే విషయాలను అధికారులు పరిశీలించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

అలాగే నిర్మాణానికి సంబంధించిన ఎం-బుక్, బిల్లులు, వౌచర్లు, అనుమతులు, పంచాయతీ తీర్మానాలు, చెల్లింపు రికార్డులు పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.

వినియోగంపై కూడా పరిశీలన అవసరం

బయ్యారం గ్రామంలో నిర్మించిన వైకుంఠధామం స్థానిక అవసరాలకు ఎంతవరకు ఉపయోగపడుతోంది? గ్రామ ప్రజలకు అందుబాటులో ఉందా? నిర్మాణం పూర్తయినప్పటి నుంచి ఎందుకు ప్రారంభానికి నోచుకోలేదు? అనే అంశాలపై కూడా అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.

గ్రామ అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్మాణం చేపట్టారా? లేక నిధుల వినియోగంలో లోపాలు జరిగాయా? అనే విషయాలు విచారణలో తేలాలని ప్రజలు అంటున్నారు.

తప్పులు తేలితే చర్యలు తీసుకోవాలి

విచారణలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు నిర్ధారణ అయితే అప్పటి సంబంధిత బాధ్యులు, కాంట్రాక్టర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ నిధులను తిరిగి రాబట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

వైకుంఠధామం నిర్మాణంపై అధికారులు పారదర్శకంగా విచారణ జరిపి పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని బయ్యారం గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.