బాపట్ల జిల్లాలో బీచ్‌లు తాత్కాలికంగా మూసివేత
అర్నబ్ తుపాను నేపథ్యంలో అధికారుల నిర్ణయం
చీరాల ఓడరేవు, రామాపురం, పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్‌ల వద్ద ఆంక్షలు
ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు రావద్దని అధికారుల సూచన
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పర్యాటకులకు అనుమతి లేదు
బాపట్ల జిల్లా | ఎన్ టుడే న్యూస్:
అర్నబ్ తుపాను ప్రభావం నేపథ్యంలో బాపట్ల జిల్లాలోని పలు బీచ్‌లను తాత్కాలికంగా మూసివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చీరాల ఓడరేవు, రామాపురం, పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్‌ల వద్ద పర్యాటకుల రాకపోకలపై ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.
తుపాను ప్రభావం దృష్ట్యా హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పర్యటనకు వచ్చే పర్యాటకులు బీచ్‌లకు రావద్దని అధికారులు సూచించినట్లు సమాచారం. తదుపరి అధికారిక ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆయా బీచ్‌లలో పర్యాటకులకు అనుమతి ఉండదని పేర్కొన్నారు.
ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.