BREAKING
thumb ● జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక thumb ● బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక thumb ● వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక thumb ● బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక thumb ● వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
మంచి మాట
Date of Publish : 27 October 2026, 04:03 pm
Posted by : SEETHA KIRAN KUMAR

అబుదాబి విమానాశ్రయంలో తెలంగాణ మహిళ మృతి

అంతర్జాతీయం అంతర్జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
27 Oct, 2026 - 04:03 PM
13 వీక్షణలు

షాద్‌నగర్‌ | ఎన్ టుడే న్యూస్‌:

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పారడైజ్‌ కాలనీకి చెందిన రజియా బేగం ఉమ్రా యాత్ర ముగించుకుని స్వదేశానికి తిరిగి వస్తుండగా అబుదాబి విమానాశ్రయంలో మృతి చెందారు. ఈ ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు.

రజియా బేగం జెడ్డా నుంచి ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన EY-616 విమానంలో అబుదాబి చేరుకున్నారు. అక్కడి నుంచి కనెక్టింగ్‌ విమానంలో హైదరాబాద్‌కు రావాల్సి ఉండగా, అంతలోనే ఆమె మృతి చెందినట్లు సమాచారం.

రజియా బేగం మృతదేహాన్ని వీలైనంత త్వరగా హైదరాబాద్‌కు తరలించేందుకు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం వెంటనే స్పందించి, అవసరమైన అధికారిక ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు.

మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు త్వరగా పూర్తయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు.