BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 24 June 2025, 06:22 am
Posted by : NTODAY NEWS OFFICIAL

చిట్యాల లో బెల్ట్ షాపులను మూసివేయాలి

తెలంగాణ
24 Jun, 2025 - 06:22 AM
377 వీక్షణలు
చిట్యాల లో బెల్ట్ షాపులను మూసివేయాలి -- తెలంగాణ మలి దశ ఉద్యమ నేత సంజయ్ దాస్ గౌడ్. NTODAY NEWS: జూన్ 23 రిపోర్టర్ కూనురు మధు నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో విచ్చలవిడిగా వెలిసిన మద్యం బెల్టు షాపులను వెంటనే మూసివేయాలని అందుకు తగిన చర్యలను తీసుకోవాలని ఎక్సైజ్, పోలీస్ శాఖలను తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, బీజేపీ నేత కూనూరు సంజయ్ దాస్ గౌడ్ డిమాండ్ చేశారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో గల్లి గల్లి లో రాత్రి పగలు లేకుండా మద్యం గొలుసు దుకాణాలు నిరంతరం నడుస్తున్నాయని దీనివలన పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాలు, ప్రార్ధన మందిరాలు,పాఠశాలల సమీపంలోనే మద్యం గొలుసు దుకాణాలు ఉండడం వల్ల మహిళలు విద్యార్థులు తాగుబోతుల వలన అసౌకర్యానికి గురవుతూ ఇబ్బందులు పడుతున్నారని దేవాలయకొచ్చే భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చిట్యాల పట్టణంలో అర్ధరాత్రులు బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మడం వలన రాత్రుల్లో కాలనీలలో కొత్త కొత్త వ్యక్తులు సంచారిస్తున్నారని ప్రజల భద్రత విషయంలో ఆందోళన కలుగుతుందని సంజయ్ దాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులలో నాసిరకం మద్యం అమ్మడం వలన వ్యవసాయ ఇతర కూలీలు యువత ఆ మద్యం సేవించడం వలన చిన్న వయసులోనే చనిపోతున్నారని వారి ఆరోగ్యం పూర్తిగా క్షినిస్తుందని ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నo అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చిట్యాల లో మద్యం షాపులు రాత్రి పది గంటలకు మూసివేస్తే పట్టణంలోని మద్యం బెల్టు దుకాణాలు 24 గంటలు ఎవరి అనుమతి, అండదండలతో నిర్వహిస్తున్నరు అని సంజయ్ దాస్ గౌడ్ ప్రశ్నించారు. వైన్ షాపుల్లో దొరకని బ్రాండ్లు బీర్లు బెల్ట్ షాపుల్లో దొరుకుతున్నాయని, వైన్ షాపుల పక్కన సిట్టింగ్లు నిర్వహించాలి అంటే ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని నిబంధనలు ఉన్నాయని, పట్టణంలో ప్రజా నివాస ప్రాంతాల్లో కాలనీలలో, ఇండ్ల ల్లో మద్యం బెల్ట్ షాపుల్లో సిట్టింగ్లు నిర్వహిస్తూ, మధ్యo ప్రియులకు ఇష్టమైన వంటలు చేస్తూ వ్యాపారం చేయడానికి ఎవరు అనుమతి ఇస్తున్నారని, ప్రజల,యువత ఆరోగ్యాలతో ఆటలాడుతున్న మద్యం బెల్ట్ షాపులపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేరని ఆయన ప్రశ్నించారు. త్వరలో మద్యం గొలుసు (బెల్ట్) షాపులు మూసివేయాలని చిట్యాల పట్టణంలోని అన్ని పార్టీల నాయకులు, మహిళా సంఘాలు యువజన,విద్యార్థి సంఘాలు కలుపుకొని ప్రత్యేక్ష ఉద్యమ కార్యాచరణ చెప్పాడుతామని మద్యం బెల్టు దుకాణాలను పూర్తిగా బంద్ చేసే విధంగా రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, మహిళలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. Follow us on Website Facebook Instagram YouTube