భారత సైన్యానికి కొత్త ఆర్మీ చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు
జాతీయం
మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీ విరమణ అనంతరం భారత సైన్యానికి 31వ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ (COAS)గా జనరల్ ధీరజ్ సేథ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
సుదీర్ఘ సైనిక అనుభవం కలిగిన జనరల్ ధీరజ్ సేథ్ భారత సైన్యంలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. దేశ భద్రత, సరిహద్దు పరిస్థితులు, ఆధునిక యుద్ధ సన్నద్ధత వంటి అంశాలపై ఆయనకు విశేష అనుభవం ఉంది.
భారత సైన్యాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జనరల్ ధీరజ్ సేథ్‌కు కేంద్ర ప్రభుత్వం, రక్షణ శాఖ అధికారులు, సైనిక ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు.