BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 30 June 2026, 09:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కాస్‌గంజ్ జిల్లాలో అత్యవసర ల్యాండింగ్ చేసిన శిక్షణ విమానం.. మహిళా పైలట్‌కు గాయాలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 09:15 PM
120 వీక్షణలు

ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లాలో సాంకేతిక లోపంతో ఓ శిక్షణ విమానం హైవే సమీపంలోని పొలంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేసింది.

అలీగఢ్‌కు చెందిన డీజీసీఏ గుర్తింపు పొందిన 'చేతక్ ఏవియేషన్' సంస్థకు చెందిన ‘VT-AFB’ సెస్నా-152 శిక్షణ విమానం సోలో ఫ్లయింగ్ సెషన్‌లో భాగంగా అలీగఢ్ నుంచి గాల్లోకి ఎగిరింది. అయితే ప్రయాణం మధ్యలో విమానంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తడంతో మహిళా ట్రైనీ పైలట్ అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నించింది.

ఈ క్రమంలో విమానం కాస్‌గంజ్ సమీపంలోని పొలంలో క్రాష్ ల్యాండింగ్ చేయగా, విద్యుత్ తీగలను ఢీకొట్టడంతో విమానం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది.

ఈ ఘటనలో మహిళా ట్రైనీ పైలట్ గాయపడగా, వెంటనే ఆమెను కాస్‌గంజ్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.