BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 30 June 2026, 09:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేట ఆర్యవైశ్య సంఘంలో కొత్త నాయకత్వం.. వరుసగా మూడోసారి శివ బాజీకి పట్టం.. గిరిధర్‌కు మండల బాధ్యతలు!

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 09:15 PM
158 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండల ఆర్యవైశ్య సంఘంలో కొత్త నాయకత్వానికి శ్రీకారం చుట్టారు. హరిప్రియ జ్యువెలరీ మార్ట్ అధినేత నాగు బండి వెంకటగిరిధర్‌ను మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా ఎన్నుకోగా, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా అనుమోలు శివ బాజీ వరుసగా మూడోసారి ఎన్నికై తన నాయకత్వాన్ని మరోసారి చాటుకున్నారు.

ఈ నియామకాలను ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు కుక్కడపు వెంకట నాగేశ్వరరావు (వైభవ్) అధికారికంగా ప్రకటించారు. నూతన అధ్యక్షుల ఎన్నికతో ఆర్యవైశ్య సంఘంలో ఉత్సాహం నెలకొంది. సంఘ అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాల విస్తరణకు ఇద్దరూ కృషి చేస్తారనే ఆశాభావాన్ని సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

నూతనంగా ఎన్నికైన నాగు బండి వెంకటగిరిధర్, అనుమోలు శివ బాజీలకు ఆర్యవైశ్య సంఘ నాయకులు, సభ్యులు, వివిధ రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.