BREAKING
thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు
Date of Publish : 30 June 2026, 08:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హెచ్‌సీయూలో నిరవధిక సమ్మెకు దిగిన కాంట్రాక్ట్ కార్మికులు.. దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారానికి ఆందోళన

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 08:19 PM
109 వీక్షణలు

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో కాంట్రాక్ట్ కార్మికులు మరోసారి ఆందోళన బాట పట్టారు. తమ దీర్ఘకాలిక డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ విశ్వవిద్యాలయ పరిపాలనా విభాగం ఎదుట నిరవధిక సమ్మె ప్రారంభించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాల కారణంగా తాము తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయామని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాల అమలుతో తమ ఉద్యోగ భద్రత దెబ్బతిందని, కార్యాలయాల్లో కార్మికులకు లభించే రక్షణలు బలహీనపడ్డాయని ఆరోపించారు.

దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న ప్రాథమిక కార్మిక హక్కులను సైతం కొత్త చట్టాల పేరుతో అణచివేస్తున్నారని కాంట్రాక్ట్ కార్మికులు మండిపడ్డారు.

ఇటీవల విశ్వవిద్యాలయంలో కొత్త కాంట్రాక్టర్ నియామకంతో పరిస్థితి మరింత దిగజారిందని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. కొత్త కాంట్రాక్టర్ కార్మిక చట్టాల నిబంధనలను ఆసరాగా చేసుకుని తమకు ఉన్న పాత హక్కులు, సౌకర్యాలు, ప్రయోజనాలను పూర్తిగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన కార్మికులు, విశ్వవిద్యాలయ యాజమాన్యం తక్షణమే స్పందించి తమతో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.