BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 30 June 2026, 08:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చుక్కారామయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిరిజన గురుకుల పాఠశాలకు ఫ్యాన్ల పంపిణీ

తెలంగాణ
/ జనగామ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 08:18 PM
121 వీక్షణలు

జనగామ జిల్లా: పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినుల సౌకర్యార్థం డాక్టర్ చుక్కారామయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 ఫ్యాన్లను అందజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాచర్ల స్వరూప, ఉప సర్పంచ్ గుగ్గిళ్ల కళ్యాణ్, ఫౌండేషన్ అధ్యక్షుడు మాచర్ల పుల్లయ్య పాల్గొని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అసిఫాకు ఫ్యాన్లను అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాచర్ల స్వరూప మాట్లాడుతూ, డాక్టర్ చుక్కారామయ్య ఫౌండేషన్ గ్రామంలో విద్య, సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థులకు అండగా నిలుస్తోందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మందికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో 10వ వార్డు సభ్యుడు చెరుపల్లి కుమారస్వామి, ఫౌండేషన్ సభ్యులు లింగంపల్లి రామస్వామి, చిక్కుడు రాములు, అనుముల మహేందర్, బెల్లి సంపత్, పులి కొమురెల్లి, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.