BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 30 June 2026, 08:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు.. సర్వర్లు మొరాయించడంతో ప్రజలకు ఇబ్బందులు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 08:02 PM
106 వీక్షణలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రిజిస్ట్రేషన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. గత రెండు రోజులుగా ప్రధాన సర్వర్లు పనిచేయకపోవడంతో భూములు, ఇళ్లు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు, బదలాయింపులు నిలిచిపోయాయి.

గత మూడు నెలల్లో ఇది నాలుగోసారి కావడంతో ప్రజలు, డాక్యుమెంట్ రైటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్లాట్ బుకింగ్, చలాన్ చెల్లింపులు, ఈ-కేవైసీ వంటి ఆన్‌లైన్ సేవలు కూడా అందుబాటులో లేకపోవడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సాంకేతిక లోపాలను గుర్తించిన రాష్ట్ర స్థాయి ఐటీ బృందం సర్వర్ల పునరుద్ధరణ కోసం చర్యలు చేపట్టింది. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించి సేవలను పునఃప్రారంభించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.