BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 30 June 2026, 08:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రైతు ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ: హరీష్ రావు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 08:19 PM
112 వీక్షణలు

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రైతు ఆశీర్వాద సభపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఇది రైతు ఆశీర్వాద సభ కాదని, రైతు వంచన సభ అని వ్యాఖ్యానించారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎకరానికి రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చిందని, కానీ రైతులకు రూ.12 వేలే ఇచ్చిందని ఆరోపించారు. అందులోనూ ఒక పంట సీజన్‌కు సంబంధించిన సాయాన్ని పూర్తిగా ఎగ్గొట్టారని విమర్శించారు.

కొన్ని సందర్భాల్లో రెండు ఎకరాల వరకే, మరికొన్ని సందర్భాల్లో మూడు ఎకరాల వరకే రైతు భరోసా పరిమితం చేశారని హరీష్ రావు పేర్కొన్నారు. రైతులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని పూర్తిగా చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పేరిట రైతులకు మొత్తం రూ.29,300 కోట్ల మేర బాకీ పడిందని హరీష్ రావు ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, పెండింగ్ బకాయిలను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.