BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 30 June 2026, 08:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ముంబై ఆస్పత్రిలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. భుజాలకు శస్త్రచికిత్స అవసరమన్న వైద్యులు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 08:02 PM
123 వీక్షణలు

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొంతకాలంగా భుజాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. రెండు భుజాల్లోని కండరాలు పూర్తిగా చిట్లిపోవడంతో పాటు రొటేటర్ కఫ్ గాయం కారణంగా ఆయన తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆరోగ్య పరీక్షల కోసం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిని పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఆయనతో పాటు సతీమణి అన్నా లెజ్నేవా కూడా ముంబై వెళ్లారు.

పవన్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు రెండు భుజాల్లో గాయాల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవాలని, అనంతరం కొంతకాలం పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోవడం అవసరమని సూచించారు.

అయితే ప్రస్తుతం తనకు అధికారిక కార్యక్రమాలు ఉన్నాయని, వాటిని పూర్తి చేసిన తర్వాత మళ్లీ ముంబై వచ్చి చికిత్స చేయించుకుంటానని పవన్ కళ్యాణ్ వైద్యులకు తెలిపినట్లు సమాచారం. అధికారిక కార్యక్రమాలు ముగిసిన అనంతరం ఆయన మరికొన్ని రోజుల్లో ముంబై వెళ్లి శస్త్రచికిత్స చేయించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.