BJYM నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా కంబాలపల్లి సతీష్ కుమార్
BJYM నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా కంబాలపల్లి సతీష్ కుమార్
ఆగస్టు 31న బాధ్యతల స్వీకరణ.. భారీ ర్యాలీకి ఏర్పాట్లు
నల్గొండ | Ntoday News
భారతీయ జనతా యువ మోర్చా (BJYM) నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా కంబాలపల్లి సతీష్ కుమార్ యాదవ్ ఆగస్టు 31న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా నల్గొండలోని బీజేపీ కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై తనకు ఆశీస్సులు అందించాలని కంబాలపల్లి సతీష్ కుమార్ యాదవ్ కోరారు. ఈ ఆనందకరమైన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తమ విలువైన సమయాన్ని కేటాయించి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు
ర్యాలీ షెడ్యూల్
ఆగస్టు 31న ఉదయం 8 గంటలకు చిట్యాలలోని సతీష్ కుమార్ నివాసం నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. అనంతరం చిట్యాల కనకదుర్గ సెంటర్ మీదుగా ర్యాలీ కొనసాగుతుంది.
ఉదయం 9 గంటలకు కనకదుర్గ అమ్మవారి దేవాలయం నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. అనంతరం 9.20 గంటలకు నార్కట్‌పల్లి వద్ద, 9.40 గంటలకు నల్గొండ రైల్వే బ్రిడ్జి–ఐటీ టవర్ వద్ద మిత్రులు, నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో కలవనున్నారు.
అక్కడి నుంచి ర్యాలీ నల్గొండలోని బీజేపీ కార్యాలయానికి చేరుకోనుంది.
ప్రధాన కార్యక్రమం
ఉదయం 10 గంటలకు నల్గొండ బస్టాండ్ పక్కన ఉన్న బీజేపీ కార్యాలయానికి చేరుకోనున్నారు.
10.20 గంటలకు BJYM నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా కంబాలపల్లి సతీష్ కుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
అనంతరం 11 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
యువతను దేశ సేవ వైపు నడిపిస్తూ పార్టీని నల్గొండ జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని సతీష్ కుమార్ యాదవ్ తెలిపారు. కార్యక్రమానికి బీజేపీ, BJYM నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
“సదా భారతమాత సేవలో” అనే నినాదంతో ముందుకు సాగుతున్న తనకు ప్రతి ఒక్కరి ఆశీస్సులు, సహకారం అవసరమని కంబాలపల్లి సతీష్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.