BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 30 August 2026, 07:51 am
Posted by : కూనురు మధు

నకిరేకల్ నియోజకవర్గ TMUS అధ్యక్షుడిగా ఉయ్యాల ప్రశాంత్ గౌడ్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
30 Aug, 2026 - 07:51 AM
113 వీక్షణలు

నకిరేకల్, ఆగస్టు 29: తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం (TMUS) నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడిగా చిట్యాల మండలం ఎలికట్టే గ్రామానికి చెందిన ఉయ్యాల ప్రశాంత్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ ప్రకటించారు.

ఈ సందర్భంగా సంజయ్ దాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థులు, యువత కీలక పాత్ర పోషించారని తెలిపారు. విద్యార్థి, యువజన ఉద్యమంలో ప్రశాంత్ గౌడ్ చురుకుగా పాల్గొని, ఉద్యమ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేశారని కొనియాడారు.

ఉద్యమకారుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం TMUS నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఉద్యమకారులకు అందాల్సిన గౌరవం, గుర్తింపు, సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు. నకిరేకల్ నియోజకవర్గంలోని ఉద్యమకారులను సంఘటితం చేసి వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని నూతన అధ్యక్షుడు ప్రశాంత్ గౌడ్‌కు సూచించారు.