BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 30 August 2026, 07:49 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అనిల్‌ అంబానీ రుణ సెటిల్మెంట్లపై సూటి ప్రశ్నలు.. ఇదెక్కడి న్యాయం?

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 07:49 AM
79 వీక్షణలు

అనిల్‌ అంబానీ రుణ సెటిల్మెంట్లపై సూటి ప్రశ్నలు.. ఇదెక్కడి న్యాయం?

అనిల్‌ అంబానీకి చెందిన కంపెనీల భారీ రుణాల పరిష్కారాలపై న్యాయవాది మాథ్యూ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. 53 బ్యాంకులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల రుణాలు తక్కువ మొత్తాల చెల్లింపులతో పరిష్కరించుకున్నారంటూ ఆయన ప్రశ్నించారు. రిలయన్స్‌ గ్రూప్‌ రుణ సంక్షోభం గతంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

రూ.49 వేల కోట్ల రుణం.. వంద రూపాయలకు 92 పైసలా?

రూ.49 వేల కోట్ల రుణాన్ని వంద రూపాయలకు 92 పైసల చొప్పున పరిష్కరించుకున్నారనే ఆరోపణలపై న్యాయవాది మాథ్యూ స్పందిస్తూ సామాన్యుల రుణాల విషయంలో కఠినంగా వ్యవహరించే వ్యవస్థ, పెద్ద సంస్థల విషయంలో ఎందుకు భిన్నంగా కనిపిస్తోందని ప్రశ్నించారు.

అదేవిధంగా మరో రూ.10 వేల కోట్ల రుణాన్ని వంద రూపాయలకు 35 పైసల చొప్పున పరిష్కరించుకున్నారని ఆరోపించారు.

పెద్దల రుణాలకు ఒక న్యాయం.. సామాన్యులకు మరో న్యాయమా?

జీ మీడియా అధినేత సుభాష్‌ చంద్రకు సంబంధించిన రూ.22 వేల కోట్ల రుణ పరిష్కారం కూడా ఇదే తరహా చర్చకు కారణమైందని పేర్కొన్నారు. కేవలం సాక్ష్యాలు లేవనే కారణంతో మోసం, మనీలాండరింగ్‌ ఆరోపణలపై నమోదైన కేసులు కొట్టివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

చట్టం అందరికీ సమానమా?

"చిన్న వ్యాపారి బ్యాంకు రుణం చెల్లించలేకపోతే అతని ఆస్తులు స్వాధీనం చేసుకుంటారు.. పెద్ద సంస్థలు వేల కోట్ల రుణాలను తగ్గింపులతో పరిష్కరించుకుంటే ఇది ఏ విధమైన న్యాయం?" అంటూ మాథ్యూ ప్రశ్నించినట్లు ప్రచారం జరుగుతోంది.

రుణ పరిష్కారాలు సాధారణంగా దివాలా చట్టం, రుణదాతల ఆమోదం, న్యాయ ప్రక్రియల ఆధారంగా జరుగుతాయి. అయితే ఇలాంటి భారీ మొత్తాల సెటిల్మెంట్లు ప్రజల్లో పారదర్శకతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. చట్టం ఒకటే అయినప్పుడు అమలు కూడా ఒకేలా ఉండాలి" అంటూ న్యాయవాది మాథ్యూ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.