BREAKING
thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
Date of Publish : 30 August 2026, 07:49 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జూబ్లీహిల్స్: చిన్న నీటిపారుదల వ్యవస్థ బలోపేతానికి కీలక సూచనలు..

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 07:49 AM
63 వీక్షణలు

జూబ్లీహిల్స్: చిన్న నీటిపారుదల వ్యవస్థ బలోపేతానికి కీలక సూచనలు.. సీఎంకు నివేదిక అందించిన రైతు సంక్షేమ కమిషన్

చిన్న నీటిపారుదల రంగం అభివృద్ధి, చెరువుల పరిరక్షణకు సంబంధించి వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించింది. జూబ్లీహిల్స్‌లో జరిగిన సమావేశంలో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, సభ్యులు రాములు నాయక్, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, గంగాధర్, ఎం. భవానీరెడ్డి పాల్గొన్నారు.

నివేదికలో ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేసిన కమిషన్.. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే ఆధునిక సాంకేతిక విధానాలతో ప్రత్యేక చిన్న నీటిపారుదల వ్యవస్థను తిరిగి ఏర్పాటు చేయాలని సూచించింది.

చిన్న, పెద్ద నీటిపారుదల వనరులను అనుసంధానం చేసేలా కమాండ్ ఏరియా ఆధారిత నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేక చిన్న నీటిపారుదల చట్టాన్ని రూపొందించాలని నివేదికలో తెలిపింది.

రాష్ట్రంలోని చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) సరిహద్దులను తక్షణమే గుర్తించి, ఆక్రమణలను తొలగించి వాటిని పరిరక్షించాలని కమిషన్ ప్రభుత్వానికి సూచించింది.

తెలంగాణలో నీటి భద్రత, వ్యవసాయ స్థిరీకరణ, గ్రామీణ జీవనోపాధుల అభివృద్ధికి చెరువుల పునరుద్ధరణ అత్యంత కీలకమని కమిషన్ పేర్కొంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పంటల మార్పిడి, ఉద్యానవన పంటల సాగు విస్తరణ, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు వంటి అంశాలపై కమిషన్ మరింత దృష్టి సారించాలని సూచించారు.

రెండేళ్ల కాలంలో రైతు సంక్షేమ కమిషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వానికి అందించిన సిఫారసులను కమిషన్ సభ్యులు ముఖ్యమంత్రికి వివరించారు. కమిషన్ పనితీరుపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.