BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 30 August 2026, 07:48 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కాంగ్రెస్‌లో క్రమశిక్షణ లేకుంటే నష్టం....

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 07:48 AM
66 వీక్షణలు

కాంగ్రెస్‌లో క్రమశిక్షణ లేకుంటే నష్టం.. గీత దాటిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి

మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌: కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కోసం పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. పార్టీ గీత దాటి వ్యవహరించే వారిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే నష్టం తప్పదని వ్యాఖ్యానించారు.

చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ క్యాబినెట్‌తో పాటు ప్రభుత్వంలోనూ కొన్ని మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. పార్టీలోని గ్రూపు తగాదాలను తగ్గించి, కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని సమతుల్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

పేదలకు అందించే పెన్షన్లను రూ.4 వేల వరకు పెంచాలని, రైతు భరోసా పథకాన్ని కొనసాగించాలని సూచించారు. 22ఏ భూముల సమస్యను పరిష్కరించాలని, ఉచిత పథకాలను తగ్గించి అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమకారులకు తగిన న్యాయం చేయాలని, పార్టీ క్యాడర్‌లో ఉన్న అసంతృప్తిని తొలగించే చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ అంశాలపై దృష్టి పెడితేనే కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.