BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 30 April 2026, 09:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

భార్య అక్రమ సంబంధాల షాక్..

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 09:50 PM
255 వీక్షణలు

భార్య అక్రమ సంబంధాల షాక్.. హుస్సేన్ సాగర్‌లో దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఉద్యోగి కుటుంబ విషాదం కలచివేస్తోంది. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతానికి చెందిన సీతారాం, నంద్యాల ప్రాంతానికి చెందిన రేణుక 2018లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఉద్యోగం నిమిత్తం కుటుంబం హైదరాబాద్‌లోని బాచుపల్లిలో స్థిరపడింది.

ఈ క్రమంలో భర్తకు తెలియకుండా రేణుక ముగ్గురితో వివాహేతర సంబంధాలు కొనసాగించినట్లు ఆరోపణలు వచ్చాయి. వారిలో రమణారెడ్డి అనే వ్యక్తితో కలిసి ఉన్న సమయంలో వ్యక్తిగత దృశ్యాలను చిత్రీకరించినట్లు తెలిసింది. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ లో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

భార్య వ్యవహారం తెలిసి తీవ్ర మనోవేదనకు గురైన సీతారాం, ఫిబ్రవరిలో 19 పేజీల ఆత్మహత్య లేఖ రాసి హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ లేఖలో తన భార్య తనను మోసం చేసిందని, ఆమెకు ఏ లోటు లేకుండా చూసుకున్నానని, కానీ ఆమె నమ్మకద్రోహం తట్టుకోలేకపోయానని పేర్కొన్నాడు.

పోలీసులు ఆ లేఖ ఆధారంగా కేసు నమోదు చేసి రేణుకతో పాటు ఆమెకు సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు రమణారెడ్డి, శ్రవణ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో కుటుంబం చీలిపోయి ఇద్దరు చిన్నారులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లినట్లు బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.