BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 18 June 2026, 05:53 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు లేక నర్సు కాన్పు చేయగా తల్లి–బిడ్డ మృతి

తెలంగాణ
/ భద్రాద్రి కొత్తగూడెం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jun, 2026 - 05:53 AM
102 వీక్షణలు

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభూనిగూడెం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వనజ (20) అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో విధి నిర్వహణలో ఉన్న నర్సు సాధారణ కాన్పు చేసింది. కాన్పు అనంతరం శిశువు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు శిశువు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఇక కాన్పు తర్వాత తల్లికి తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించింది. వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ వనజ మృతి చెందింది.

ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే తమ కుటుంబాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని గ్రామస్థులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.