BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 15 April 2026, 09:17 pm
Posted by : కూనురు మధు

40 గ్రామాల సర్పంచుల చారిత్రాత్మక తీర్మానం

తెలంగాణ
/ నల్గొండ / నకిరేకల్
15 Apr, 2026 - 09:17 PM
229 వీక్షణలు

భద్రతకు భరోసా: 40 గ్రామాల సర్పంచుల చారిత్రాత్మక తీర్మానం. NTODAY NEWS నకిరేకల్ 

హెల్మెట్, సీటు బెల్టు లేనిదే ప్రయాణం వద్దు

​ రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా నకిరేకల్ నియోజకవర్గం సరికొత్త రికార్డుకు వేదికైంది. 'ARRIVE ALIVE' రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో నియోజకవర్గ పరిధిలోని 40 గ్రామాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు రోడ్డు నిబంధనలపై కీలక తీర్మానం చేశారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు  వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల ప్రాణరక్షణే ప్రథమ ప్రాధాన్యతగా ప్రజాప్రతినిధులు ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రకటించారు. ఈ తీర్మానంలో ​ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అని,
​కారు ప్రయాణాల్లో డ్రైవర్‌తో పాటు ప్రయాణికులు కూడా సీటు బెల్టు ధరించాల్సిందే అని,
​మద్యం సేవించి వాహనాలు నడపరాదు అని తీర్మానించారు ​ఈ చారిత్రాత్మక నిర్ణయంలో నియోజకవర్గంలోని సర్పంచులు కీలక పాత్ర పోషించారు. చిట్యాల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం, నార్కట్‌పల్లి సర్పంచ్ జేరిపోతుల భరత్, బొజ్జ సుందర్, కట్ట వెంకటరెడ్డి తదితర సర్పంచులందరూ కలిసి తీర్మాన పత్రాలను డీజీపీ శివధర్ రెడ్డికి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు అందజేశారు.