BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 23 August 2026, 06:07 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

భోజనానికి పిలిచి హత్య.. పూజా గదిలో నరబలి తల దాచిన నిందితుడు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:07 AM
113 వీక్షణలు

భోజనానికి పిలిచి హత్య.. పూజా గదిలో నరబలి తల దాచిన నిందితుడు

బొలాంగీర్: భార్యను తిరిగి తెచ్చుకోవాలనే మూఢనమ్మకంతో ఘాతుకం.. ఐదుగురు అరెస్ట్

ఒడిశా: భోజనానికి ఆహ్వానించి నమ్మకంగా ఇంటికి పిలిచిన వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన ఒడిశాలోని బొలాంగీర్ జిల్లాలో కలకలం రేపింది. ఆగస్టు 18న జరిగిన ఈ ఘటనలో సంతోష్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు శత్రుఘ్న సాహూ తన సహచరులతో కలిసి సంతోష్‌ను భోజనానికి పిలిచాడు. అనంతరం అతడు నిద్రలోకి జారుకున్న సమయంలో కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మృతదేహం నుంచి తలను వేరు చేసి, గ్రామం వెలుపల ఉన్న చెరువులో మొండెాన్ని పడేసినట్లు వెల్లడించారు.

తెగిపోయిన తలను మాత్రం సాహూ తన ఇంట్లోని పూజా గదిలో దాచినట్లు దర్యాప్తులో బయటపడింది. భార్యను తిరిగి తన వద్దకు తీసుకురావాలనే మూఢనమ్మకంతో నరబలి ఇచ్చేందుకు ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు శత్రుఘ్న సాహూతో పాటు మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.