BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

​భవిష్యత్ తరాల కోసమే అభివృద్ధి పనులు

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
14 Apr, 2026 - 07:45 AM
95 వీక్షణలు

​భవిష్యత్ తరాల కోసమే అభివృద్ధి పనులు: మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

​లక్షెట్టిపేట: రాబోయే మూడు నాలుగు తరాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పనులు చేయడమే తన లక్ష్యమని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. సోమవారం లక్షెట్టిపేట పట్టణంలోని స్థానిక విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

​రోడ్ల విస్తరణ వివరాలు:

పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా శాశ్వత ప్రాతిపదికన రోడ్ల అభివృద్ధి చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

​ఉత్కూరు చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు 80 ఫీట్ల రోడ్డు.

​పాత బస్టాండ్ నుండి గోదావరి వరకు మొదటి 150 మీటర్ల వరకు 50 ఫీట్లు, ఆ తర్వాత 40 ఫీట్ల రోడ్డును అభివృద్ధి పరుస్తున్నట్లు పేర్కొన్నారు.

​మహాలక్ష్మి వాడలో 30 ఫీట్ల రోడ్డు పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు.

​ట్రాఫిక్ మళ్లింపు మరియు ప్రణాళిక:

బస్టాండ్ లోపలికి వచ్చే వాహనాలు పాత రోడ్డు ద్వారానే వస్తాయని, అయితే బస్టాండ్ నుండి వెళ్లే కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ బస్సులు సీఎస్ఐ మీదుగా అనిత హోటల్ చౌరస్తా వరకు వెళ్లి జాతీయ రహదారి పైకి చేరుతాయన్నారు. అదేవిధంగా మంచిర్యాల వెళ్లే బస్సులు మహాలక్ష్మి వాడ గుండా కాకుండా ఇటిక్యాల మీదుగా వెళ్తాయని వివరించారు.

​వ్యాపారులకు విజ్ఞప్తి:

అభివృద్ధి పనుల వల్ల కొంతకాలం ఇబ్బందులు ఎదురైనప్పటికీ, భవిష్యత్తులో వ్యాపారాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మే ఒకటో తారీఖు లోపు అక్రమణలను ఎవరికి వారు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేని పక్షంలో మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. నష్టపోయిన చిన్న వ్యాపారులకు ప్రత్యామ్నాయంగా స్థలాలు చూపిస్తామని, రోడ్ల అభివృద్ధి అనంతరం వాణిజ్య సముదాయం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

​ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య, వైస్ చైర్మన్ మోత్కురి రాజేశ్వరి, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు ఆరిఫ్, నాయకులు వెంకటస్వామి గౌడ్, షాహిద్ అలీ, వార్డు కౌన్సిలర్లు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు