BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

BREAKING -విప్లవ గాయకుడు జహంగీర్ కన్నుమూత

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / తుర్కపల్లి
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
02 Apr, 2026 - 11:00 AM
362 వీక్షణలు

ప్రజా గాయకుడు యండి. జహంగీర్ మృతి – విప్లవ కళాకారునికి నివాళులు

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలానికి చెందిన ప్రజా గాయకుడు, రచయిత, ప్రజానాట్యమండలి ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ కమిటీ సభ్యులు, ప్రస్తుత సారధి కళాకారుడు యండి. జహంగీర్ గారు గుండెపోటుతో మరణించడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆయన మృతికి ప్రజా సంఘాలు, కళాకారులు, కార్మిక సంఘాలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

ప్రజా ఉద్యమాల్లో అగ్రగామి పాత్ర

యండి. జహంగీర్ గారు ప్రజానాట్యమండలి ద్వారా 1990ల కాలంలోనే ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. ముఖ్యంగా 1992 నుండి 1999 వరకు భువనగిరి డివిజన్‌లో కళాకారుడిగా పనిచేస్తూ అనేక గ్రామాల్లో తన ఆట, పాటల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేశారు. పాలకుల విధానాలను ఎండగడుతూ, సామాజిక సమస్యలను తన కళారూపాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.

మహాసభలు, ప్రచార కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు

1993లో భువనగిరి పట్టణంలో జరిగిన ప్రజానాట్యమండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభల విజయానికి జహంగీర్ గారి కృషి విశేషం. మూడు నెలలపాటు గ్రామ గ్రామాన తిరిగి ఆట, పాటలు, పల్లె సుద్దుల ద్వారా ప్రచారం నిర్వహించి మహాసభలను విజయవంతం చేయడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు.

కూలీ, రైతు ఉద్యమాల్లో కళా పోరాటం

కూలీ పోరాటాలు, బీడీ కార్మికులు, పవర్‌లూమ్ కార్మికులు, అమాలి మరియు అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై ఆయన తన కళారూపాల ద్వారా పోరాటాన్ని ముందుకు నడిపించారు. గ్రామ గ్రామాన తిరిగి కూలీలను ఏకం చేస్తూ ఉద్యమాలకు ఊపునిచ్చారు. రైతాంగ పోరాటాల్లో కూడా ఆయన పాటలు ప్రజలకు స్పూర్తినిచ్చాయి.

కుల వివక్ష వ్యతిరేక ప్రచారంలో ముందుండి

1998లో కుల వివక్ష, అంటరానితనం నిర్మూలన కోసం జరిగిన ప్రచారాల్లో జహంగీర్ గారు ముఖ్య పాత్ర పోషించారు. తన కళారూపాల ద్వారా సమానత్వ సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.

తెలంగాణ ఉద్యమం మరియు తర్వాతి సేవలు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గాయకుడిగా పాల్గొన్న ఆయన, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ కళాబృందాలలో సారధి కళాకారుడిగా సేవలు అందించారు. అలాగే ప్రజా సంఘాలతో కలిసి వివిధ పోరాటాల్లో తన కళను కొనసాగించారు.

ఉపాధి హామీ చట్టం కోసం పోరాటం

ఇటీవల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట పరిరక్షణ కోసం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ప్రచార కార్యక్రమాల్లో, మహా ధర్నాల్లో కూడా పాల్గొని కూలీలను చైతన్యపరిచారు.

సామాజిక విప్లవ స్ఫూర్తి వ్యాప్తి

ప్రతి సంవత్సరం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతుల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొని సామాజిక సమానత్వం, న్యాయం కోసం సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.

తీర్చలేని లోటు

చిన్ననాటి నుండి ఎర్రజెండా చేతబట్టి ప్రజా గాయకుడిగా, రచయితగా సమ సమాజ నిర్మాణం కోసం కృషి చేసిన జహంగీర్ గారి మృతి కళా రంగానికి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటుగా మిగిలింది.

సంతాపం

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరఫున ఆయన మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటిస్తూ, వారి కుటుంబ సభ్యులకు గాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

ఇట్లు

కొండమడుగు నర్సింహ్మ

మాజీ కార్యదర్శి, ప్రజానాట్యమండలి

భువనగిరి డివిజన్ & ఉమ్మడి నల్లగొండ జిల్లా