BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 04 April 2026, 10:50 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి అనుదీప్ మరణం పై ప్రత్యేక విచారణలో వేగం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Apr, 2026 - 10:50 AM
455 వీక్షణలు

 చాట్రాయి అనుదీప్ మరణం పై ప్రత్యేక విచారణలో వేగం… రంగంలోకి దిగిన అధికారి రాజశేఖర్

చాట్రాయి, ఏప్రిల్ 4:

చాట్రాయి మండల కేంద్రంలో వివాదాస్పదంగా మారిన అంబటి అనుదీప్ మృతి కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ కేసు నిగ్గు తేల్చేందుకు నియమితులైన ప్రత్యేక విచారణ అధికారి రాజశేఖర్ శుక్రవారం రంగంలోకి దిగారు.

ముందుగా చాట్రాయికి చేరుకున్న ఆయన, అనుదీప్ మృతి చెందిన ప్రదేశాన్ని పరిశీలించి కీలక వివరాలను సేకరించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను కలుసుకుని, సంఘటన జరిగిన రోజు పరిస్థితులపై విచారణ జరిపారు.

అనుదీప్ మృతి ఆత్మహత్యా? లేక హత్యా? అనే అంశాన్ని సమగ్రంగా విచారించి త్వరలోనే నిజాలు వెలుగులోకి తీసుకువస్తామని రాజశేఖర్ తెలిపారు. ఈ దర్యాప్తుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు.

ఈ కేసులో భాగంగా అనుదీప్ స్నేహితులతో పాటు ప్రియురాలు మరియు ఆమె కుటుంబ సభ్యులను కూడా విచారించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అలాగే చాట్రాయి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన విచారణ అధికారి, కేసుకు సంబంధించిన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇక ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారిని ఏలూరుకు పిలిపించగా, జనసేన నాయకులు తుమ్మల జగన్, పాశం నాగబాబు, తుమ్మల శంకర్ హాజరై తమ వాంగ్మూలాలు ఇచ్చారు. కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని వారు కోరగా, జిల్లా ఎస్పీ నుండి ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయని విచారణ అధికారి తెలిపినట్లు తుమ్మల జగన్ పేర్కొన్నారు.