BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 March 2026, 10:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి ఘటనపై ఉద్రిక్తత.. అనుదీప్ మృతి కేసులో సమగ్ర విచారణకు డిమాండ్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 10:43 PM
225 వీక్షణలు

చాట్రాయి ఘటనపై ఉద్రిక్తత.. అనుదీప్ మృతి కేసులో సమగ్ర విచారణకు డిమాండ్

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం చాట్రాయి గ్రామంలో జరిగిన అంబటి అనుదీప్ అనుమానాస్పద మృతి కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 17 ఏళ్ల యువకుడి మృతి పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యాయం కోసం ముందుకు వచ్చారు.

ఈ నేపథ్యంలో అనుదీప్ కుటుంబ సభ్యులు, తండ్రి అంబటి గోపాలరావు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్‌ను కలిసి తమ వేదనను వివరించారు. జనసేన నాయకుడు, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు కుటుంబ సభ్యులతో కలిసి ఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

అనుదీప్ మృతి వెనుక ప్రేమ వ్యవహారం కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రెడ్డి అప్పలనాయుడు, “నూజివీడులో ఇలాంటి ఘటన జరగడం బాధాకరం. మృతుడు మా పార్టీ కార్యకర్త కావడంతో ఈ ఘటనపై మరింత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యుల ఆవేదనను ప్రభుత్వం, పోలీసులు గమనించాలి” అని అన్నారు. మంత్రి కొలుసు పార్థసారథి కూడా ఈ ఘటనపై ప్రత్యేక విచారణకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.

అనుదీప్ మృతి కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలని, స్థానిక పోలీసులతో పాటు ఇతర ప్రాంతాల అధికారులతో ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని, సీసీ కెమెరా ఫుటేజ్ సహా అన్ని ఆధారాలను పరిశీలించి నిజాన్ని బయటపెట్టాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ బాధిత కుటుంబానికి హామీ ఇస్తూ, ప్రత్యేక అధికారితో విచారణ చేపట్టి నిజాన్ని నిగ్గుతేలుస్తామని తెలిపారు. ఈ కేసులో ఎవరు ఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో చాట్రాయి టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు, కొండలరావు తదితర పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.