BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 07 June 2026, 06:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్సై డి రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jun, 2026 - 06:30 PM
281 వీక్షణలు

చాట్రాయి: 07.06.2026 – ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు ఈ రోజు ఉదయం ఎస్.ఐ డి. రామకృష్ణ ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు తమ పాత అలవాట్లను మానుకుని క్రమపద్ధతిగా సత్ప్రవర్తన పాటించాలని స్పష్టం చేశారు. ఎలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకూడదని, సమాజంలో శాంతి సామరస్యానికి ఏ విధమైన విఘాతం కలిగించరాదు అని హెచ్చరించారు. చట్టవ్యతిరేక పనుల నుండి దూరంగా ఉండి బాధ్యతా యుతమైన పౌరులుగా మెలగాలని సూచించారు.

సత్ప్రవర్తనను పాటిస్తూ, నేరపూరిత చర్యలకు పాల్పడని రౌడీ షీట్లను తొలగించే ప్రక్రియను పరిశీలించి, వారి పేర్లను పై అధికారులకు సిఫార్సు చేస్తామని ఎస్.ఐ గారు హామీ ఇచ్చారు. కౌన్సిలింగ్ సమయంలో రౌడీ షీటర్లకు వ్యక్తిగతంగా మరియు సమూహంగా గమనికలు ఇచ్చి, తప్పులు పునరావృతమైతే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.