BREAKING
పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?...
Date of Publish : 22 April 2026, 05:33 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయిలో పోలీసు అవగాహన సదస్సు మహిళల రక్షణ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Apr, 2026 - 05:33 AM
195 వీక్షణలు

నేర నియంత్రణ పై అవగాహన

సమాజంలో మహిళల రక్షణ, నేర నియంత్రణ మరియు ప్రజల భద్రతే ధ్యేయంగా ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోంది. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాలపై నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ పర్యవేక్షణలో చాట్రాయి వెలుగు కార్యాలయ ప్రాంగణంలో నూజివీడు రూరల్ సీఐ కె. రామకృష్ణ అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్య‌క్రమంలో చాట్రాయి ఎస్ఐ డి. రామకృష్ణ, సిబ్బంది ప్రజలకు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. మహిళా సంరక్షణ శక్తి టీమ్స్ మహిళలు మరియు విద్యార్థినుల భద్రత కోసం ఏర్పాటు చేసిన శక్తి టీమ్స్ ప్రాధాన్యతను వివరించారు. మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, వేధింపులకు గురైతే భయం వీడి పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.

ఆన్‌లైన్ మోసాలు, ఓటిపి, బ్యాంక్ వివరాలు ఇతరులకు చెప్పడం వల్ల కలిగే నష్టాలను వివరించారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 కి ఫోన్ చేయాలని సూచించారు. వేసవి కాలంలో ప్రజలు ఊర్లకు వెళ్లే సమయంలో ఇళ్లకు పటిష్టమైన తాళాలు వేయాలని, విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112 కు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్రామాల్లో మరియు వ్యాపార సంస్థల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాలను అరికట్టవచ్చని, ఇది మూడవ కన్నులా పనిచేస్తుందని వివరించారు.

ద్విచక్ర వాహన దారులు ప్రయాణించే సమయంలో తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేని పక్షంలో చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడమే కాకుండా భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

ప్రజల సహకారం తోనే నేరరహిత సమాజాన్ని నిర్మించగలమని, ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, పోలీస్ సిబ్బంది, మహిళలు మరియు స్థానిక యువత పాల్గొన్నారు.