BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 07 August 2026, 05:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయిమండలంలో ఏవో బి శివశంకర్ ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Aug, 2026 - 05:02 PM
42 వీక్షణలు

చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని అన్ని గ్రామాల రైతు సేవా కేంద్రాల్లో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా రైతు సేవా కేంద్రాల వ్యవసాయ సహాయక అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు, నీటి వినియోగదారుల సంఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులు రైతులకు ఎల్నినో ప్రభావంపై అవగాహన కల్పించారు.

ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. పంటల యాజమాన్య పద్ధతులు, నీటి వనరులను పొదుపుగా వినియోగించుకునే విధానం, బిందు సేద్యం ప్రయోజనాలు, ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.

ఖాళీగా ఉన్న భూములను ఏడాది పొడవునా పంటలు లేదా పచ్చిరొట్ట పంటలతో కప్పి ఉంచే విధానాన్ని రైతులు అవలంబించాలని సూచించారు. నవధాన్యాలు, ఆయిల్‌పామ్‌–మామిడి తోటల్లో నవధాన్యాలు, పప్పుధాన్యాల సాగు చేపట్టడం ద్వారా భూమి సారాన్ని కాపాడుకోవడంతో పాటు నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు.

అనంతరం ఆరుగొలనుపేట గ్రామంలో రైతులతో అధికారులు చర్చించి, ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై సూచనలు అందించారు.