BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 18 March 2026, 01:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చీపురుగూడెం పాఠశాలకు కంప్యూటర్ అందజేత

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Mar, 2026 - 01:03 PM
196 వీక్షణలు

చీపురుగూడెం పాఠశాలకు కంప్యూటర్ అందజేత – ఉపాధ్యాయుడు నంద్యాల శ్రీనివాసరెడ్డికి ఘన సన్మానం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చీపురుగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో అభివృద్ధికి మరో అడుగు పడింది. సుమారు రూ.65 వేల విలువైన పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్‌ను రోటరీ క్లబ్ ద్వారా అందజేయించడంలో కీలక పాత్ర పోషించిన సి. గుడిపాడు పాఠశాల ఉపాధ్యాయుడు నంద్యాల శ్రీనివాసరెడ్డిని ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చాట్రాయి మండల విద్యాశాఖ అధికారి-1 మాసగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, పాఠశాలల్లో ఆధునిక సదుపాయాలు పెంపొందించడం విద్యార్థుల అభ్యాసానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.

పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ డి. సుందరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు బొట్టు లక్ష్మణరావు మాట్లాడుతూ, విద్యా రంగానికి ఉపాధ్యాయులు చేస్తున్న సేవలు అమూల్యమని కొనియాడారు. గ్రామీణ పాఠశాలల్లో సదుపాయాలు పెరగడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సత్తెనపల్లి రాము, బి.సిహెచ్. రాంబాబు, ఏ. చెన్నారావు, గంటా షాకీనా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.