BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 06 June 2026, 01:48 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

చిలకలూరిపేట మోటార్ వర్కర్స్ దశాబ్దాల కల

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
06 Jun, 2026 - 01:48 PM
46 వీక్షణలు

జూన్ 11న  ప్రత్తిపాటి పుల్లారావు ఆటో నగర్ ప్రారంభోత్సవం

చిలకలూరిపేట నియోజకవర్గంలోని మోటార్ వర్కర్స్ దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఆటో నగర్ కలను మాజీ మంత్రి, శాసన సభ్యులు  ప్రత్తిపాటి పుల్లారావు  సాకారం చేసినట్లు నాయకులు తెలిపారు. గత వైసీపీ పాలనలో ఎటువంటి చర్యలకు నోచుకోకుండా నిలిచిపోయిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  సహకారంతో ముందుకు తీసుకువెళ్లి ఆటో నగర్ ఏర్పాటుకు ప్రత్తిపాటి పుల్లారావు  విశేష కృషి చేశారని పేర్కొన్నారు.

మోటార్ వర్కర్స్ సమస్యలు, వారి వృత్తి ఇబ్బందులు బాగా తెలిసిన నాయకుడిగా, వారికి శాశ్వత స్థలం కల్పిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఆటో నగర్ నిర్మాణాన్ని పూర్తి చేయించి, అన్ని వృత్తుల వారూ ఒకేచోట తమ వ్యాపారాలు, పనులు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేసిన ఘనత  ప్రత్తిపాటి పుల్లారావు దేనని నాయకులు కొనియాడారు. ఆటో నగర్ ఏర్పాటుతో వందలాది కుటుంబాలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు, మెరుగైన వసతులు, వ్యాపారాభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పించబడిందని తెలిపారు.

మోటార్ వర్కర్స్ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ ఆటో నగర్‌కు  ప్రత్తిపాటి పుల్లారావు ఆటో నగర్" అని నామకరణం చేయడం జరిగిందన్నారు. ఈ ఆటో నగర్ ప్రారంభోత్సవ కార్యక్రమం 11-06-2026 ఉదయం 9.00 గంటలకు ఘనంగా నిర్వహించబడనుంది.

ఈ సందర్భంగా భారత మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ డాక్టర్  ఏపీజే అబ్దుల్ కలాం  విగ్రహం, అలాగే తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, అన్న     నందమూరి తారక రామారావు  విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమాలు కూడా నిర్వహించబడనున్నాయి.

చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా , పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్ , ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి , మోటార్ వర్కర్స్ వెల్ఫేర్ యూనియన్ అధ్యక్షులు నల్లమోతు సాంబశివరావు (బుజ్జి మేస్త్రి) , ఉపాధ్యక్షులు ఎస్.కె. బాబు మేస్త్రి , ప్రధాన కార్యదర్శి తిరులో ఏడుకొండలు , కార్యదర్శి అనంత శ్రీనివాసరావు , ఉప కార్యదర్శి ఖుద్దూస్ , ట్రెజరర్ పఠాన్ నబీఖాన్ , కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆటో వర్కర్స్, మోటార్ మెకానిక్స్, కార్మికులు, వ్యాపారులు, నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. చిలకలూరిపేట మోటార్ వర్కర్స్ దశాబ్దాల కలను సాకారం చేసిన మాజీ మంత్రి, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కి ఈ సందర్భంగా మోటార్ వర్కర్స్ సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.