BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 June 2026, 10:15 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
06 Jun, 2026 - 10:15 PM
99 వీక్షణలు

చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి నియామకం

NTODAY NEWS చిలకలూరిపేట:

చిలకలూరిపేట పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా శ్రీమతి తోట వెంకట పద్మావతి నియామకాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే Prathipati Pulla Rao అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ బలోపేతంతో పాటు మహిళల సమస్యలను పార్టీ దృష్టికి తీసుకువెళ్లడంలో, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో తెలుగు మహిళా విభాగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన తోట వెంకట పద్మావతి పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు.

నియామకంపై స్పందించిన తోట వెంకట పద్మావతి, పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మహిళా సాధికారత, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పఠాన్ సమద్ ఖాన్, కార్యదర్శి మద్దుమాల రవి, రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు జవ్వాజి మదన్ మోహన్, యడ్లపాడు మండల పార్టీ అధ్యక్షుడు కామినేని సాయిబాబా, పట్టణ ఉపాధ్యక్షుడు మురుకొండ మల్లిబాబు, క్లస్టర్ ఇంచార్జి మద్దిబోయిన శివ, సీనియర్ నాయకులు తోట బ్రహ్మస్వాములు, తోట సత్యనారాయణ తదితరులు పాల్గొని నూతనంగా నియమితులైన తోట వెంకట పద్మావతికి శుభాకాంక్షలు తెలిపారు.