BREAKING
thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు
Date of Publish : 19 August 2026, 06:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడి గ్రంథాలయాన్ని పరిశీలించిన జుత్తుక నాగరాజు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 06:47 PM
64 వీక్షణలు

చింతలపూడి గ్రంథాలయాన్ని పరిశీలించిన జుత్తుక నాగరాజు

ఏలూరు జిల్లా చింతలపూడి గ్రంథాలయాన్ని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి జుత్తుక నాగరాజు సందర్శించారు.

ఈ సందర్భంగా గ్రంథాలయంలోని పుస్తకాల సంఖ్య, వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాల వివరాలను పరిశీలించారు. ఆధార పట్టికలు, స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించి గ్రంథాలయ నిర్వహణ తీరుపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని నాగరాజు తెలిపారు. ప్రత్యేక పుస్తకాలు లేదా అధ్యయన సామగ్రి అవసరమైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

చింతలపూడి గ్రంథాలయంలో త్వరలోనే డిజిటల్ గ్రంథాలయం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. డిజిటల్ వనరుల ద్వారా విద్యార్థులకు మరింత మెరుగైన సమాచారాన్ని అందించడమే లక్ష్యమన్నారు.

గ్రంథాలయాన్ని విద్యార్థులు, పాఠకులకు మరింత ఉపయోగకరమైన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని జుత్తుక నాగరాజు పేర్కొన్నారు.