BREAKING
బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి....
Date of Publish : 12 September 2026, 11:06 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడి: వ్యవసాయ విద్యుత్ పరికరాల చోరీ పొలంలో మోటార్లు, కేబుల్ వైర్లు ఎత్తుకెళ్లిన దుండగులు.. ఆందోళనలో రైతు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Sep, 2026 - 11:06 AM
17 వీక్షణలు

చింతలపూడి: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామపంచాయతీ పరిధిలోని ముక్కంపాడు గ్రామానికి చెందిన రైతు గద్దె యువరాజు పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. వ్యవసాయ భూమిలో సాగు అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటార్లు, కేబుల్ వైర్లు, ఇతర ఇనుప పరికరాలను దుండగులు ధ్వంసం చేసి ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఉదయం పొలానికి వెళ్లిన రైతు యువరాజు అక్కడి పరిస్థితిని చూసి ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. విద్యుత్ పరికరాలు కట్ చేసి ఉండటంతో పాటు విలువైన ఇనుప సామగ్రి కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. పంటల సాగు కోసం కష్టపడి సమకూర్చుకున్న వ్యవసాయ పరికరాలు చోరీకి గురికావడంతో తీవ్రంగా నష్టపోయినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పెట్టుబడులు పెరుగుతున్న సమయంలో పొలాల్లో ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటార్లు, కేబుల్ వైర్లు, ఇనుప పరికరాలు చోరీకి గురవుతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంటోంది. రాత్రి వేళల్లో వ్యవసాయ పొలాల వద్ద నిఘా పెంచాలని, చోరీలకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు పోలీసులను కోరుతున్నారు. ఈ ఘటనపై బాధిత రైతు అత్యవసర సేవల నంబర్ 112కు సమాచారం అందించినట్లు తెలిసింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి చోరీకి సంబంధించిన వివరాలను సేకరించే అవకాశం ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, చోరీకి గురైన సామగ్రి విలువ తదితర అంశాలు తెలియాల్సి ఉంది.