BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 17 June 2026, 01:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. మాంసం నింపిన బొమ్మలతో కొత్త ఎత్తుగడ!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jun, 2026 - 01:22 PM
162 వీక్షణలు

కాకినాడ జిల్లా పామాయిల్ తోటలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు పదో రోజుకు చేరినా ఫలితం లేకుండా కొనసాగుతున్నాయి. ఈ కేసును ఛేదించేందుకు అధికారులు ప్రత్యేక వ్యూహాలతో రంగంలోకి దిగారు.

వన్యమృగాల కదలికలను గుర్తించేందుకు ఘటన స్థలంలో ఇనుప బోనును ఏర్పాటు చేసి, అందులో చిన్నారిని పోలిన రెండు బొమ్మలను ఉంచారు. ఆ బొమ్మల్లో మాంసం ముక్కలు పెట్టి జంతువులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. సమీపంలో కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేసి ప్రతి కదలికను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

ఇక కేసులో మరో అనుమానాస్పద అంశం వెలుగులోకి వచ్చింది. పాపతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క జూన్ 13న మృతి చెందింది. జూన్ 9న ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చిన ఈ కుక్క, ఆ తర్వాత ఆహారం తీసుకోకుండా వింత ప్రవర్తన చూపినట్లు సమాచారం. దీనికి జీపీఎస్ ట్రాకర్ అమర్చినా ఆచూకీ స్పష్టంగా లభించలేదు. సుమారు 80 కిలోమీటర్ల దూరం సంచరించిన తర్వాత అది ఇంటికి చేరినట్లు తెలుస్తోంది. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగానే మృతి చెందినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.

జూన్ 6న తుని మండలం సిహెచ్. అగ్రహారం ప్రాంతంలో తల్లిదండ్రులు గణేష్, భవాని తో కలిసి పామాయిల్ తోటకు వెళ్లిన సమయంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. తల్లిదండ్రుల మధ్య సమన్వయ లోపం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి జిల్లా యంత్రాంగం రూ. లక్ష రివార్డు ప్రకటించింది.