BREAKING
thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు
Date of Publish : 02 August 2026, 07:46 pm
Posted by : NTODAY NEWS

చిన్నారి వసుమనాస్ కార్తికేయ జన్మదినం సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
02 Aug, 2026 - 07:46 PM
44 వీక్షణలు

హైదరాబాద్ | ఆగస్టు 2 | NTODAY NEWS

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 'రెడీ టూ సర్వ్' ఫౌండేషన్, అమ్మ హెల్పింగ్ హాండ్స్ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

డాక్టర్ మధు విజయ్ తనయుడు చిన్నారి వసుమనాస్ కార్తికేయ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సేవా కార్యక్రమంలో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన పేద రోగులు, వారి కుటుంబ సభ్యులు, అవసరమైన వారికి సుమారు 300 మందికి ఉచితంగా భోజనం పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు స్వచ్ఛంద సేవకులు (వాలంటీర్లు) పాల్గొని స్వయంగా భోజనం పంపిణీ చేశారు. సమాజంలో ఆకలితో బాధపడుతున్న వారికి అండగా నిలవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. పేద ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించనున్నట్లు వెల్లడించారు.

ఆస్పత్రుల వద్ద చికిత్స కోసం నిరీక్షించే పేద రోగులు, వారి కుటుంబ సభ్యులకు ఈ అన్నదానం ఎంతో ఉపయోగకరంగా మారిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. 'రెడీ టూ సర్వ్' ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకులు పెద్ది శంకర్ మాట్లాడుతూ, సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలనుకునే దాతలు, స్వచ్ఛంద సేవకులు ముందుకు రావాలని కోరారు. సమాజ సేవలో మరింత మంది భాగస్వాములు కావడం ద్వారా అవసరమైన వారికి మరింత విస్తృతంగా సహాయం అందించగలమని ఆయన పేర్కొన్నారు.