BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 30 May 2026, 07:40 pm
Posted by : V శ్రీనివాస్

​చిన్నారుల భవిష్యత్తుకు అంగన్‌వాడీ బంగారు బాట

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
30 May, 2026 - 07:40 PM
251 వీక్షణలు

​చిన్నారుల భవిష్యత్తుకు ‘అంగన్‌వాడీ’ బంగారు బాట

​ ఘనంగా ‘అమ్మ మాట - అంగన్‌వాడీ బాట’ కార్యక్రమం

​మెనూ ప్రకారం పౌష్టికాహారం, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి: జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్

అంగన్‌వాడీ కేంద్రాల వైపు చిన్నారులు వేసే ప్రతి అడుగు వారి బంగారు భవిష్యత్తుకు బలమైన పునాది అని మంచిర్యాల జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ అన్నారు. శనివారం మంచిర్యాల పట్టణంలోని రామ్‌నగర్ సెక్టార్‌లో "అమ్మ మాట - అంగన్‌వాడీ బాట" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సి.డి.పి.ఓ విష్ణు ప్రియ, సూపర్వైజర్ జ్యోతి, అంగన్వాడీ టీచర్లతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించి, వారి ఉజ్వల భవిష్యత్తుకు తల్లిదండ్రులు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

​ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ "అమ్మ మాట - అంగన్‌వాడీ బాట" కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నారుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. కేంద్రాలకు వచ్చే పిల్లలకు రోజువారీ మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు, సమయానుసారంగా వారి ఎత్తు, బరువులను నమోదు చేస్తూ శారీరక, మానసిక ఎదుగుదలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వివరించారు.

​‘పోషణ్ అభియాన్’ పథకంలో భాగంగా చిన్నారుల ఆరోగ్యం, శారీరక దృఢత్వంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రౌఫ్ ఖాన్ స్పష్టం చేశారు. నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం, సరైన పోషణ ద్వారానే పిల్లల భవిష్యత్తు ప్రగతి పథంలో సాగుతుందని, ఇందుకోసం శాఖా పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.